Sunday, December 22, 2024

ఆ ఐదుగురు మహిళలను చంపిన వ్యక్తే… చేవెళ్లలో ఆమెను చంపాడు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్:  సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. సదరు సీరియల్ కిల్లర్ మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని నమ్మించి ఆ తరువాత వారిని చంపేసేవాడు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చేవెళ్లలో నాలుగు రోజుల క్రితం అనసూయ అనే మహిళ అదృశ్యం కావడంతో వారి కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేవెళ్ల అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం కనిపించడంతో అనసూయదిగా గుర్తించారు. ఆమెతో బాబు అలియాస్ రామస్వామి అనే వ్యక్తి చనువుగా ఉన్నట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు.

గతంలో రామస్వామని ఐదుగురు మహిళలను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. రామస్వామి ఒంటరి మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి అనంతరం బంగారు ఆభరణాలు, నగదుతో పారిపోయేవాడు. అనసూయ ఒంటరిగా ఉండడం గమనించి ఆమెకు మాయమాటలు చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కొన్ని రోజుల మంచిగా ఉన్నట్టు నటించాడు. ఆమెను చేవెళ్లలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం అనసూయ మెడకు చీర కొంగు బిగించి చంపాడు. అనంతరం కాళ్ల కడియాలు, చెవి దిద్దులు, నగదు తీసుకొని మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. గతంలో ఓ మహిళ మొండెం, తల వేరు చేసి పాతిపెట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News