Monday, March 31, 2025

లగచర్ల ఘటన.. బీఆర్‌ఎస్‌ నేత సురేష్‌కు భూమి లేదు: కలెక్టర్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్‌: లగచర్ల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ1గా ఉన్న బీఆర్‌ఎస్‌ నేత సురేష్‌కు అసలు భూమి లేదని వికారాబాద్ కలెక్టర్‌ తేల్చారు.  ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్‌ ఇచ్చిన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్‌, అతని సోదరుడు మహేష్‌కు ఎలాంటి భూమి లేదని నివేదిక పేర్కొన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న 42 మంది నిందితుల్లో 19 మందికి భూమి లేదని కలెక్టర్‌ స్పస్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడి ఘటనలో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 16మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News