Wednesday, January 22, 2025

పారిపోయిన ప్రేమజంట…. తల్లిని చిత్రహింసలు పెడుతున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: బషీరాబాద్‌లో మరో షాద్ నగర్ తరహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొడుకు ప్రేమించిన అమ్మాయితో వెళ్లిపోయాడని 3 నెలలుగా తల్లిని పోలీసులు లాఠీలతో కొడుతున్నారు. కూలీకి పోతేగానీ పూట గడవని ఆ కుటుంబాన్ని పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారు. ఈ సంఘటన  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…  నవల్గా గ్రామానికి చెందిన లోహడ నరేష్(17), కాశీంపూర్ గ్రామానికి చెందిన బాలిక(16) ప్రేమించుకొని 3 నెలల క్రితం ఇంట్లో నుండి పారిపోయారు.

అయితే బాలికను నరేష్ కిడ్నాప్ చేశాడని ఆమె కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నరేష్ తల్లిని బషీరాబాద్ స్టేషన్‌కు పిలిచి కొడుకు అడ్రస్ చెప్పాలని కాళ్లు, చేతులు వాచిపోయేలా లాఠీ దెబ్బలు కొట్టారు. నరేష్ దొరికే వరకు తల్లి కళావతి రోజు పోలీస్ స్టేషన్‌కు రావాలని ఎస్ఐ రమేశ్ కుమార్ హుకుం జారీ చేశారు. పిఎస్ కు వచ్చాక ఆమెను కొట్టడం, బయట కూర్చోబెట్టడం మూడు నెలలుగా పోలీసులు ఇలానే చేస్తున్నారని ఆమె స్థానిక మీడియాతో వాపోయారు. తన కుమారుడి జాడ చెప్పకపోతే తుపాకీతో కాల్చి చంపేస్తా అంటూ ఎస్ఐ బెదిరింపులు పాల్పడినట్టు ఆమె ఆరోపణలు చేశారు. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News