Wednesday, January 22, 2025

వికారాబాద్ లో నెమలిని వేటాడి… కాల్చుకు తిన్న యువకులు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: ఇద్దరు యువకులు సరదాగా వేటకు వెళ్లారు. ఆ యువకులకు జాతీయ పక్షి నెమలి కనిపించడంతో చంపి కాల్చుకు తిన్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల పరిధిలో జరిగింది. ఇద్దరు యువకులు కుందేళ్లు వేటాడానికి అడవికి వెళ్లారు. వాళ్లకు నెమలి కనిపించడంతో వేటాడారు. దానిని చంపిన తరువాత నిప్పులపై కాల్చుకొని భోజనం చేశారు. ఈ విషయం అందరికీ తెలియడంతో అటవీశాఖ అధికారులకు తెలిసింది. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి యువకులపై కేసు నమోదు చేశారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News