Monday, December 23, 2024

మొయినాబాద్ లో యువతి మృతి కేసులో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

మొయినాబాద్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మరణించిన కేసు కొత్త మలుపు తిరిగింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లికి చెందిన తైసీన్ అనే యువతి నాలుగు రోజుల క్రితం కనబడకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు సోమవారంనాడు కాలిపోయిన పరిస్థితిలో కనుగొన్నారు. ఆమెది హత్యేనని పోలీసులు మొదట అనుమానించినా, సంఘటన స్థలం వద్ద దొరికిన ఆధారాలు, సిసిటివి ఫుటేజీని బట్టి ఆత్మహత్య కావచ్చని తాజాగా భావిస్తున్నారు. సంఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ కూడా పోలీసులకు దొరికింది. ఆ యువతిని ఆటోలో తీసుకువెళ్లిన ఆటోడ్రైవర్ ను పోలీసులు విచారించగా, ఆమెను అక్కడ వదిలేసి తాను వెనక్కు వచ్చేశానని చెప్పాడు. గతంలో తైసీన్ రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో వ్యక్తిగత కారణాల వల్ల తైసీన్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News