Sunday, December 22, 2024

అనంత పద్మనాభ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దంపతులు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ టౌన్ : దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం వికారాబాద్ ఆలంపల్లి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ దంపతులు పట్టు వస్త్రల సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సమేతంగా స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా చైర్ పర్సన్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వికారాబాద్ పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన చైర్ పర్సన్ వికారాబాద్ పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News