Monday, January 20, 2025

బిజెపిలోకి వికాస్‌రావు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 30న కిషన్‌రెడ్డి సమక్షంలో చేరిక

మనతెలంగాణ/ హైదరాబాద్ : మాజీ కేంద్రమంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ బిజెపి సీనియర్ నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్‌రావు బిజెపిలో చేరనున్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో చేరనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యాసాగర్‌రావు వేములవాడ నుంచి తన కుమారుడైన వికాస్‌రావును పార్టీలో చేర్పించి తన రాజకీయ వారసత్వాన్ని అప్పగించనున్నట్లు సమాచారం. ఏడాదిగా వికాస్‌రావు సైతం వేములవాడలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. వేములవాడ బిజెపి టికెట్ వికాస్‌రావుకు దక్కే అవకాశాలున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News