అమరావతి: ప్రేమ వివాహం చేసుకున్న మూడు నెలలకే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వికోట మండలం కుంభర్లపల్లి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రంజిత్ కుమార్ అనే వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలిలోని మేనత్త ఇంటి వద్ద ఉంటూ టెక్స్‌టైల్స్ షాపింగ్ మాల్‌లో పని చేసేవాడు. ఈ క్రమంలో నీలం హర్షప్రియం అమ్మాయి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇరువైపుల పెద్దలను ఒప్పించి మార్చి 8న ప్రేమ వివాహం చేసుకున్నారు. నవ దంపతులతో అత్త వీర వెంకటనాగలక్ష్మి సుధారాణి కూడా ఉంటుంది.
Also Read: కాళేశ్వరం జలానికి లక్ష జనహారతి
జూన్ 6న తండ్రి మంజునాథతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం తన పడకగదిలోకి వెళ్లిపోయాడు. అదే రాత్రి 11 గంటల సమయంలో రంజిత్ కుమార్ ఉరేసుకున్నాడని తన సోదరుడు మహేష్ కుమార్‌కు అత్త పోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.