Sunday, December 22, 2024

తెలంగాణలో బిజెపికి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో బిజెపికి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముందు గోషామహల్ బిజెపి నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం తన రాజీనామా లేఖను ఆయన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పంపించారు.

పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బిజెపి తొలి వికెట్ పడినట్లైంది కాగా, త్వరలోనే విక్రమ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News