Tuesday, December 24, 2024

అవి రెండూ ఛాలెంజ్‌లే

- Advertisement -
- Advertisement -

Kamal Haasan's Vikram to release on June 3rd

కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు.

స్టార్ హీరో సూర్య ఓ స్పెషల్ రోల్ చేశారు. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మీడియాతో ’విక్రమ్’ చిత్రం విశేషాల గురించి హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ “విక్రమ్ సినిమాలో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. ‘విక్రమ్’ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. హీరో నితిన్, వారి నాన్నగారు సుధాకర్ రెడ్డికి సినిమాపై ప్యాషన్ వుంది. వారి నిర్మాణంలో చాలా మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వారు ‘విక్రమ్’ని దాదాపు 400కు పైగా థియేటర్స్‌లో భారీ విడుదల చేయడం ఆనందంగా వుంది. ఈ రోజుల్లో సినిమా బాగా ఆడటం, సినిమా బావుండటం రెండూ ఛాలెంజ్‌లే. ‘విక్రమ్’ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది.

‘విక్రమ్’లో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పాత్రలకు మంచి ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్‌ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. ‘విక్రమ్’లో సూర్య ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. నిజానికి హీరోని బుక్ చేసేటప్పుడు నేరుగా కలసి బోకే ఇచ్చి బుక్ చేస్తారు. నేను కూడా సూర్యకి ఒక బోకే ఇద్దామని అనుకున్నా. ‘విక్రమ్’ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. “నేను చేస్తా అన్నయ్యా”అని సూర్య అన్నారు. ఇక మా బ్యానర్‌లో సూర్యతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. మహేశ్ నారాయణ్‌తో మా బ్యానర్‌లో నెక్స్ సినిమా చేస్తున్నాం. మహేశ్ నారాయణ్ గతంలో ‘విశ్వరూపం’కు ఎడిటర్‌గా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో సినిమాటోగ్రఫీ కూడా నేర్చుకున్నారు. ఇక ‘భారతీయుడు 2’ చిత్రాన్ని ఈ ఏడాది పూర్తి చేయడానికే ప్రయత్నిస్తున్నాం”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News