Wednesday, December 25, 2024

‘విక్రమ్’ అద్భుతమైన సినిమా

- Advertisement -
- Advertisement -

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’ ఇటీవలే విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేశారు. హైదారాబాద్‌లో జరిగిన సినిమా సక్సెస్ మీట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ… విక్రమ్ సినిమాని ‘శ్రేష్ఠ్ మూవీస్’కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను అద్భుతంగా తీశారు’ అని అన్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ… ‘విక్రమ్’ను పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో రానా మాట్లాడుతూ… కమల్ హాసన్‌ను చూసి నటన నేర్చుకున్నాము, దర్శకుడు లోకేష్ కనగారాజ్ కమల్‌ని చాలా కూల్‌గా చూపించారు. ‘విక్రమ్’ అద్భుతమైన సినిమా” అని చెప్పారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అఫ్ ఇండియన్ మూవీగా నిలిచిందని పేర్కొన్నారు.

VIKRAM Movie Success Meet in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News