Saturday, December 21, 2024

‘విక్రమ్’ రాబోతున్నాడు

- Advertisement -
- Advertisement -

‘Vikram’ release on June 3

 

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్‌ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. విడుదల తేదీతో పాటు మేకింగ్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ‘విక్రమ్’ జూన్ 3న థియేటర్లలోకి రానున్నారు. “జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా ‘విక్రమ్’ కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను’‘ అని కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ త్రయాన్ని శక్తివంతమైన పాత్రలలో చూపించే మేకింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ తన బిజిఎమ్‌తో వీడియోకి థ్రిల్ ఫీల్‌ని ఇచ్చాడు. విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News