Wednesday, January 22, 2025

గద్వాల్‌లో బోల్తాపడిన బస్సు…. 26 మంది సురక్షితం

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్: గద్వాల జిల్లా ఉండవెల్లి స్టేజీ దగ్గర జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వోల్వో బస్సు బోల్తా పడింది. విక్రమ్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 26 మంది ప్రయణికులు ఉన్నారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సు పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: చంపిన వ్యక్తి కలలోకి వచ్చి కలవరపెడుతున్నాడని…. పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News