Monday, December 23, 2024

కంగనపై విక్రమాదిత్య పోటీ

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తారని ఆయన తల్లి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ శనివారం వెల్లడించారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సినీ నటి కంగనా రనౌత్‌పై విక్రమాదిత్య పోటీ చేస్తారని ఆమె తెలిపారు. మండి ప్రజలు ఎల్లప్పుడూ తమ వెంటే ఉన్నారని ఆమె చెప్పారు. మండి లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు గెలుపొంది ప్రస్తుతం సిట్టింగ్ ఎంపిగా ప్రతిభా సింగ్ ఉన్నారు. విక్రమాదిత్యపై కంగన చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖాతరు చేయబోనని ఆమె చెప్పారు.

క్లిష్ట పరిస్థితులలో సైతం తాను మండి నుంచి గెలుపొందానని ఆమె తెలిపారు. తాను బీఫ్ తింటానంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వూ గురించి విక్రమాదిత్య చేసిన వ్యాఖ్యలపై గురువారం కంగన స్పందిస్తూ మండి ఏమీ విక్రమాదిత్య తాతల జాగీరు కాదని, తనను ఎవరూ బెదిరించి వెనక్కు పంపించలేరని చెప్పారు. దీనిపై విక్రమాదిత్య శుక్రవారం స్పందిస్తూ ఆమెకు సద్బుద్ధిని ప్రసాదించి దేవభూమి నుంచి వాపసు వెళ్లాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజల గురించి ఆమెకు ఏమీ తెలియదని, ఈ ఎన్నికల్లో ఆమె గెలిచే ప్రసక్తే లేదని విక్రమాదిత్య చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News