Sunday, January 19, 2025

నేడు నింగిలోకి స్వదేశీ తొలి ప్రైవేట్ రాకెట్

- Advertisement -
- Advertisement -

చెన్నై/న్యూఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష అంకుర పరిశ్రమ “స్కైరూట్ ఏరోస్పేస్‌” తమ మొట్టమొదటి రాకెట్ విక్రమ్‌ఎస్ లేదా విక్రమ్1ను శుక్రవారం నింగిలోకి పంపించడానికి రంగం సిద్ధమైంది. చెన్నైకు 115 కిమీ దూరంలో శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ ) ఈ రాకెట్‌ను ప్రయోగిస్తుంది. భారత అంతరిక్ష కార్యక్రమాలకు ప్రైవేట్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం 2020 లోనే ఆహ్వానించిన తరువాత స్కైరూట్ మొట్టమొదటి సంస్థగా రెక్క లు విప్పింది. అంతకుముందు ఈనెల 15 వ తేదీనే ఈ ప్రయోగానికి నిర్ణయమైనప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో శుక్రవారానికి మారింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 81 కిలోమీటర్ల ఎత్తుకు నింగి లోకి విక్రమ్ ఎస్ దూసుకెళ్తుంది.

ఈ రాకెట్ సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్. ఇది చెన్నై అంకుర పరిశ్రమ స్సేస్ కిట్జ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్‌స్పేస్ టెక్, లతోపాటు విదేశీయ ఆర్మేనియన్ బెజూమ్‌క్యు స్పేస్ రీసెర్చి ల్యాబ్ తదితర మూడు కస్టమర్ పేలోడ్స్‌ను నింగిలోకి తీసుకెళ్తుంది. ప్రపంచం లోని మొట్టమొదటి కొన్ని మిశ్రమ రాకెట్లలో ఒకటైన ఈ రాకెట్ ఆరు మీటర్ల పొడవుతో ఉంటుంది. దీనికి 3 డి ప్రింటెడ్ సా లిడ్ థ్రస్టర్స్ ఉంటాయి. ఇవి రాకెట్‌ను ఎలాంటి తొ ట్రుపాటు లేకుండా నిదానంగా ముందుకు తోసుకెళ్ల గలుగుతాయి. ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇదో పెద్ద అడుగుగా ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రొమోషన్, అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఛైర్మన్ పవన్ గోయెంకా అభివర్ణించారు.

భారత్ ఈ ప్రయోగంతో కొత్త చరిత్ర సృష్టిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. తక్కువ కాలం లోనే అంతరిక్ష అంకుర పరిశ్రమలు వినూత్న సామర్ధాన్ని సంతరించుకున్నాయని, ఈమేరకు అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ, నానోశాటిలైట్, లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్ట మ్స్, రీసెర్చి తదితర ప్రాజెక్టులతో దాదాపు 102 అంకుర పరిశ్రమలు అంతరిక్ష ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నాయని వివరించారు. ఇస్రోకు చెందిన వివిధ కేంద్రాలు ఇందులో పాలుపంచుకున్నాయని గోయెం కా పేర్కొన్నారు. శ్రీహరికోటలోని రెండు ప్రయోగ వేదికలు ఉండగా, ప్రొపెల్షన్ సెంటర్ నుంచి రాకెట్‌ను ప్రయోగిస్తారు. భూమికి 500 కిమీ దిగువ కక్షలోకి మూడు పెలోడ్‌లను రాకెట్ ప్రవేశ పెడుతుంది.

స్కైరూట్ టీమ్‌కు గుడ్ లక్ : కెటిఆర్

హైద్రాబాద్ : హైదరాబాద్‌కి చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వికెఎస్ రాకెట్ శుక్రవారం నింగిలోకి దూసుకెళ్ల్నుంది. ఈ నేపథ్యం లో స్కై రూట్ టీమ్‌కు టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గుడ్ లక్ చెప్పారు. సక్సెస్ కోసం మేమంతా ఎదురు చూస్తున్నామని కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News