Saturday, December 21, 2024

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో…

- Advertisement -
- Advertisement -

Village backdrop is bhag sale

 

పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, ఏబీసీడీ వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా ‘భాగ్ సాలే’‘ అనే చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు మరో కొత్త చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇది బిగ్ బెన్ సినిమాస్ సోలో ప్రాజెక్ట్‌గా నిర్మితం కానుందని నిర్మాత యశ్ రంగినేని చెప్పారు. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య రావ్ మాధాడి హీరోగా ‘ఓ పిట్ట కథ’ చిత్ర దర్శకుడు చెందు ముద్దు డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News