Friday, December 20, 2024

టీఎస్‌ఆర్టీసిలో సమన్వయకర్తలుగా విలేజ్ బస్ ఆఫీసర్లు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: వినూత్న కార్యక్రమాలతో ప్రయాణికుల ఆదరణ పొందేందుకు టీఎస్‌ఆర్టీసి చేస్తున్న కృషి అభినందనీయమని జీహెచ్‌ఎంసి సర్కిల్ 10 (ఫలక్‌నుమా) డిప్యూటీ కమిషనర్ సిహెచ్.రాజేందర్‌రెడ్డి ప్రశంసంచారు. టీఎస్‌ఆర్టీసిలో కొత్తగా ప్రవేశపెట్టిన విలేజ్ బస్ ఆఫీసర్లకు శుక్రవారం ఫలక్‌నుమా డిపోలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యేక లోగోతో కూడిన టీషర్టు, పుస్తకాన్ని ఆ డిపో మేనేజర్ పి.ఎస్.జాకీర్ హుస్సేన్‌తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ కరోనాతో ఆర్టీసికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతగిలినా వినూత్న పథకాలతో పుంజుకోవటం ఉన్నతాధికారుల, ఉద్యోగుల పట్టుదల, ఐక్యతకు నిదర్శనమన్నారు.

డిపో మేనేజర్ పి.ఎస్.జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఆర్టీసి ఎండి సజ్జనార్ కొత్తగా ప్రవేశపెట్టిన విలేజ్ బస్ ఆఫీసర్లు గ్రామ ప్రజలకు, ఆర్టీసికి మధ్య సమన్వకర్తలుగా పనిచేస్తారన్నారు. గ్రామ సభలలో పాల్గొని, స్థానిక ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలను, విలువైన సూచనలు సేకరించి ఉన్నతాధికరులకు తెలియజేస్తారన్నారు. ప్రధానంగా సమస్యలు, కావాల్సిన సదుపాయాలు, ఆగ్రామ ప్రజలు కోరుకుంటున్న సేవలపై దృష్టి కేంద్రీకరిస్తారన్నారు. డిపోలో ఐదు, ఫారూక్‌నగర్ డిపోలో ఏడు మంది విలేజ్ బస్ ఆఫీసర్లుగా ఎంపికైనట్లు తెలిపారు. ఫలక్‌నుమా డిపో పరిధిలోని కొత్తూరు, దెబ్బడగూడ, నేదునూరు, గూడురు, శంకరాపురం గ్రామాలున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎఎం(ఇ) టి.దయాకర్, ఎఎం(పి) సైదులు, ఎఎం(ఎఫ్) కోదండ , డిపో, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News