Monday, December 23, 2024

కెసిఆర్ మంజూరు చేసిన నిధులతో గ్రామాభివృద్ధి చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

గీసుకొండ: మండలంలోని వంచనగిరి గ్రామానికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చొరవతో సీఎం కేసీఆర్ స్పెషల్ డెవలప్‌మెంటు ఫండ్ నుంచి రూ. 9.50 కోట్లు మంజూరు చేసినప్పటికీ గ్రామంలో పనులు జరుగక అభివృద్ధికి నోచుకోవడంలేదని వంచనగిరి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి మంజూరైన నిధులపై ఎంపీపీ భీమగాని సౌజన్యతో కలిసి వంచనగిరి సర్పంచ్ అమిరిశెట్టి అనసూర్య, ఎంపీటీసీ నాగరబోయిన రజిత, గ్రామస్థులు బుధవారం కోటగండి వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వంచగిరి గ్రామానికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులను గ్రామంలో ఖర్చు పెట్టకుండా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అడ్డుకొని నియోజకవర్గంలోని ఇతర గ్రామాలకు నిధులు మళ్లించారన్నారు.

గ్రామంలో రూ. 9.50 కోట్ల నిధులను 193 వర్కులకు కేటాయిస్తే అందులో 101 వర్కులను క్యాన్సల్ చేసి వేరే గ్రామాలకు రూ. 4.93 కోట్ల నిధులను మళ్లించారని, మరో 19 వర్కులకు సంబంధించిన రూ. 3.38 కోట్లను క్యాన్సల్ చేశారన్నారు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ కాంగ్రెస్ వారు కావడంతో అభివృద్ధి జరిగే కొండా దంపతులకు పేరు వస్తుందనే గ్రామానికి వచ్చిన నిధులను నియోజకవర్గంలోని పలు గ్రామాలకు కేటాయించారన్నారు. ఇకనైనా మా గ్రామానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయకపోతే ఎమ్మెల్యేకు గ్రామస్థులచే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆప్షన్ రహీమ్, వార్డుసభ్యులు కర్ణాకర్, కిరణ్, బిక్షపతి, నాయకులు రాజు, మదు, రాజు, నవాబ్, యూత్ నాయకులు వినయ్, జయంత్, కర్ణాకర్, పవన్, రాంచరణ్, రామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News