Monday, December 23, 2024

పాడి పంటలతో గ్రామాభివృద్ధి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ రూరల్ : గొల్ల కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీ సుకెళ్లడమే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ మం డల పరిధిలోని నాగనూల్ గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బైకానీ శ్రీనివాస్ యాదవ్‌లు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ం ఏర్పడక ముందు ఏ గ్రామంలోనైనా ప్రతి దానికి అనేక ఇబ్బందులు ఉండేవని, పశువులకు మేత లే క పశువులను అమ్ముకున్నామని, కానీ నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రజల కష్టాలను తీర్చుకుంటూ వస్తున్నామన్నారు. నేడు బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి గ్రామంలో పాడి పంటలతో అద్భుతంగా అభివృద్ధి చెందాయన్నారు. గతంలో నాగనూల్ చెరువు నిండాలంటే క ప్పలకు పెళ్లి చేసేవారని, నేడు కెఎల్‌ఐ ద్వారా చెరువు నిండి నిరంతరం అలుగు పారుతుందని, ఇదంతా సిఎం కెసిఆర్ కృషేనని అన్నారు.

ఒకప్పుడు రైతుల కన్ను మొగులుదిక్కు ఉండేదని నేడు కెఎల్ ఐ కాలువల దిక్కు చూస్తున్నారని, రైతుకు వ్యవసా యం చేయడానికి సాగునీళ్లు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, పెట్టుబడి సాయం ఇచ్చి, యంత్ర పరికరాలు ఇచ్చి, రైతు చనిపోతే రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. యాదవులకు గొ ర్రెలు, ముదిరాజ్‌లకు చేపలు, రజకులకు ఉచిత క రెంట్, ప్రతి కులానికి ఏదో విధంగా లబ్ధి చేయాల ని సిఎం కెసిఆర్ కుల వృత్తులకు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. గొల్ల కుర్మలు కోరిన గొర్రెలను కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించడం జరిగిందన్నారు.

పంపిణీ చేసిన గొర్రెలకు ఇన్సూరెన్స్, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని, ఏ కారణం చేత గాని పంపిణీ చేసిన గొర్రెలు చనిపోయినట్లైతే వాటి స్థానంలో మరో గొర్రెను అందించడం జరుగుతుందన్నారు. 100 సంచార పశు వై ద్య శాలలు, 196 2 అంబులెన్స్‌లు ఏర్పాటు చేయ డం జరిగిందన్నారు. కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిని ఆదుకోవడం జరుగుతుందని, గొ ల్ల, కుర్మ కులస్థులు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

మాంసం కొరతను తీర్చడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉన్న గొల్ల కుర్మ కుటుంబాల ఆర్థిక ఎదుగుదల కోసం గొర్రెలను ఇవ్వడంతో పా టు ఇన్సూరెన్స్, దాణా వంటి కార్యక్రమాలను ని ర్వహించడం జరిగిందన్నారు. వ్యాధులు వచ్చినట్లైతే వైద్య సదుపాయాలను కూడా అందించడం జరిగిందన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోనే మొదటిసారిగా కులవృత్తులను బలోపేతం చేయడం జరిగిందని, అన్ని వర్గాలు అభివృద్ధితో పాటు గొల్ల, కుర్మ కులస్థుల సంక్షేమ కోసం వారికి ప్రోత్సాహాన్ని అందించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.

అనంతరం నాగనూల్ గ్రామంలో తుమ్మల నిరంజన్ అనే వ్యక్తి చెరువులో చేపల వేట కు వెళ్లి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి జిల్లా జనరల్ ఆసుపత్రికి చేరుకుని ఆయన మృతదేహాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News