Friday, December 27, 2024

తెలంగాణలో గ్రామగ్రామాన సుపరిపాలన

- Advertisement -
- Advertisement -

గద్వాల ప్రతినిధి : తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తెలంగాణ లో గ్రామ గ్రామాన సుపరిపాలన అందజేస్తున్నట్లు జడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. శనివారం సిఎన్జి ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సుపరిపాలన దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి కార్యక్రమ ంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ గతంలో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకొని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకొని ప్రజల వద్దకు పాలన తెలంగాణ ముఖ్య మంత్రి తీసుకువచ్చినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయా లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించుకొని ప్రజలకు మరింత సేవలు చేరువైనట్లు తెలిపారు. రాజధాని లో నూతన సెక్రటేరియట్ ఏర్పాటు చేసి దానికి డా. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

ప్రతి ప్రభుత్వ శాఖ దగ్గరగా ఉండటం వల్ల పరిపాలన మరింత సులువుగా ఉండి ప్రజలకు సమస్యలు తీరతాయని అన్నారు. గద్వాల జిల్లా కలెక్టర్ , ఎస్పీ కార్యాలయాలను ఈ నెల 12న ముఖ్యమ ంత్రి ప్రారంభిస్తున్నందున హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటే ప్రభు త్వం మరింత ప్రజల దగ్గరకు చేరుతుందన్నా రు. వివిధ శాఖల నుండి ఉత్తమ ఉద్యోగులుగా అవా ర్డు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఇంటింటి కి తాగునీరు, సాగు విస్తీర్ణం పెరగడం, హెల్త్ పా రామీటర్స్ ఇంప్రూవ్ కావడం ఇవన్నీ చూస్తున్నామ ని తెలిపారు. నేడు 21 రోజుల పాటు ఆయా శా ఖ లు సాధించిన ప్రగతిని తెలుసుకుంటున్నామని తె లిపారు. ముఖ్యంగా జూన్ 8న రైతు పండగలు, చెరువుల దగ్గర పండుగలు జరుపుకున్నామని అ న్నారు. సుపరిపాలన గురించి మాట్లాడుతున్నామ ంటే ఉద్యోగులు అంకితభావంతో పని చేసే జిల్లాను ముందుకు తీసుకురావాలన్నారు.

ఉద్యోగుల అనుభవం, వారి నైపుణ్యతను బట్టి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. ఈ నెల 12న ఐడిఓసి భవనం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పారంబిస్తున్నందున ఇక నుండి అందరం ఒకే చోట ఉండి పని చేస్తామని అధికారులకు అభినందనలు తెలిపారు. బాలభవన్ విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ స ందర్భంగా పరిపాలనలో ఉత్తమ సేవలు అందించి న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్, ఆర్డీఓ రాములు, వడ్డేపల్లి మున్సిపల్ చైర్మ న్ అరుణ, ఎస్‌ఈ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు సంబంధిత అధికారులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News