Wednesday, January 22, 2025

రూ. 2 కోట్లకే అమ్మకానికి మొత్తం గ్రామం

- Advertisement -
- Advertisement -

 

మాడ్రిడ్ : మనలో చాలామంది సొంతంగా ఇల్లు లేదా అత్యంత విలాసవంతమైన విల్లా కొనుక్కోవాలని కలలు కంటుంటారు. దీనికోసం కోటి రూపాయలైనా ఖర్చు చేయడానికి వెనుకాడరు. అయితే ఇంచుమించూ అంతే మొత్తంలో ఏకంగా ఒక గ్రామాన్నే కొనుగోలు చేయడానికి ఆఫర్ వస్తే ఆశ్చర్యమే. స్పెయిన్ లోని ఓ గ్రామాన్ని కేవలం 2,27,000 యూరోలకే ( సుమారు రూ.2 కోట్లు మాత్రమే) అమ్మచూపుతున్నారు. స్పెయిన్ లోని సాల్టో డే కాస్ట్రో అనే ఈ గ్రామం పోర్చుగల్ సరిహద్దులో ఉంది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి మూడు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. ఆ ప్రాంతంలో 1950 లో ఓ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినప్పుడు కార్మికుల కోసం విద్యుత్ ఉత్పత్తి సంస్థ కొన్ని ఇళ్లను నిర్మించింది.

ప్రాజెక్టు పూర్తయిన తరువాత అక్కడివారంతా సమీపాన గల పట్టణాలకు వెళ్లి పోవడంతో 1990 చివరి నాటికి ఆ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. 44 ఇళ్లు, ఓ హోటల్, చర్చి, పాఠశాల , స్విమ్మింగ్ పూల్‌తోపాటు ఇతర సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్షంతో ఓ కుటుంబం 2000లో ఆ గ్రామాన్ని కొనుగోలు చేసింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా అనుకున్నది సాగలేదు.

దీంతో చివరకు ఆ గ్రామాన్ని అమ్ముకోవాలని నిర్ణయించారు. స్పెయిన్‌కు చెందిన ఐడియలిస్టా అనే ప్రముఖ వెబ్‌సైట్‌లో ఆ వివరాలను ప్రకటించారు. పట్టణంలో ఉంటున్నందున ఈ గ్రామాన్ని అమ్ముకుంటున్నానని గ్రామ యజమాని ప్రకటించారు. దీనిపై భారీ స్పందన వచ్చి ఇప్పటికే 50 వేల మంది ఆ ప్రాపర్టీ వివరాలను చూశారు. రష్యా, ఫ్రాన్స్, బెల్జియంతోపాటు బ్రిటన్‌కు చెందిన 300 మంది ఆ గ్రామాన్ని కొనడానికి ముందుకు వచ్చినట్టు విక్రయ సంస్థ ప్రతినిధి రోడ్రిగజ్ వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News