Monday, December 23, 2024

యువకుడి మృతి.. పోలీసులపై గ్రామస్తులు దాడి

- Advertisement -
- Advertisement -

సూర్యపేట జిల్లాలో పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. నాగారం మండలం ఫనిగిరిలో మంగళవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అయితే, తనిఖీ చేస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ పై వచ్చిన ఓ యువకుడు కారును ఢీకొట్టాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకుడి మృతికి పోలీసులే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై చెప్పులతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News