Saturday, December 21, 2024

వేల్పూర్‌లో ఘనంగా పల్లెప్రగతి సంబురాలు

- Advertisement -
- Advertisement -

వేల్పూర్ : మండలంలో తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా మహిళలు గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా పండుగ సంబురాలు జరిపారు. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను సర్పంచు తీగల రాధ మోహన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించిదశాబ్ధ కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల గుండా డిజె పాటలు, బతుకమ్మ పాటలతో ప్రకృతి వనం వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈసందర్భంగా పంచాయతీ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బీమ జమున, అర్‌టిఎ మెంబర్ రేగుల రాములు, అమీనాపూర్ సర్పంచ్ రాజేశ్వర్, ఎంపిఓ జావీద్‌అలీ, ఎపిఓ అశోక్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, ఉప సర్పంచ్ ఎల్కపల్లి మహేష్, సెక్రెటరీ వినోద్‌కుమార్, అరుణ్, విపుల్, గ్రామపంచాయతీ పాలకవర్గ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News