Thursday, January 23, 2025

అదుపు తప్పితే అంతే ..

- Advertisement -
- Advertisement -

మద్దూరు: గ్రామీణ ప్రాంతాల రోడ్డు ఆధ్వానంగా తయారు కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దూళ్మిట్ట మండల కేంద్రానికి అనుకొని ఉన్న చెక్‌డ్యామ్ వరద నీరు ప్రభావానికి చెక్ డ్యామ్ రోడ్డు, బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బైరాన్‌పల్లి గ్రామం నుంచి దూళ్మిట్ట మండల కేంద్రానికి వెళ్లే ఈ రోడ్డు మార్గాన వివిధ పనుల నిమిత్త గ్రామస్థులు, రైతులు వాహనదారులు రాకపోకలు కొనసాగిస్తుంటారు.

రోడ్డు దెబ్బతినడంతో ఈ రోడ్డు మార్గాన వెళ్లాలంటే వాహనదారులు హడలి పోయారు. రోడ్డు మరమ్మతులు నోచుకోలేదని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఈ రోడ్డు మార్గాన ప్రయాణించే వాహన దారులు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు నాయకులు స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని పలువురు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News