కొత్త రహదారుల నిర్మాణానికి
రూ. 1377కోట్లు మంజూరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామీణ రోడ్లకు మహర్ధశ పట్టనుంది. గ్రామీ ణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల మేర నూతన రహదారుల నిర్మాణానికి రూ.13 77.66 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క సో మవారం ఒక ప్రకటనలో సిఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల ద్వారా 92 నియోజకవర్గాల్లోని 641 పనులను చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఆర్థి క ఇబ్బందులు ఎదురవుతున్నా గ్రామీణ రో డ్లకు పట్టు బట్టి మంత్రి సీతక్క నిధులు సా ధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరి న్ని నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొందని తెలిపారు. సిఆర్‌ఆర్ రోడ్ల కోసం రెండు మూడు రోజుల్లో మరో రూ.400 కోట్ల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మం జూరు చేయనుందని వివరించారు.