Saturday, September 21, 2024

గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె ప్రగతికి అంకురార్పణ

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా

శంషాబాద్: పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని, పల్లెలు పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి చేసేందుకు గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యాక్రమానికి అంకురార్పణ చేసారని రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జిల్లా పంచాయతీ శాఖ అధ్వర్యంలో శంషాబాద్ మండలం కవ్వగూడ గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి దినోత్సవంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి అధికారులు, ప్రజా ప్రతినిధులు అన్ని వర్గాల సలహాలు తీసుకుని బృహత్తరమైన కార్యక్రమం తీసుకువచ్చారన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందడంతో పాటు పారిశుధ్యం మెరుగుపడిందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెల రూపు రేఖలే మారిపోయాయని, పల్లెల్లో ప్రభుత్వం రాష్ట్రములోని 12,769 గ్రామాలను 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ ను సాధించిందన్నారు. తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో, దశాబ్ది స్వీయ పాలనలో కొత్త స్వరం పురివిప్పుకుంది. ప్రతి ఊరుకు హరితహారం, నర్సరీ, డంపింగ్ యార్డు, ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, వైకుంఠధామాలు, క్రీడా స్థలాలు, పల్లె దవాఖానాలు, మిషన్ భగీరథ నీళ్లు, 24 గంటల విద్యుత్ తో వెలుగుల వాకిల్లుగా తెలంగాణ పల్లెలు పటిష్ఠం అయ్యాయని, గ్రామాలు స్వయం సమృద్ధితో ఎదిగాయని, దశాబ్ది ఉత్సవం వేళ కొత్త ఉత్సాహంతో నిండాయని అన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ ను ఏర్పాటుతోపాటు 12745 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలు వచ్చాయని తెలిపారు.

గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. ప్రభుత్వం తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్ ను సాధించింది. న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు రాష్ట్రపతి చేతులమీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20 వేల మంది వీఆర్‌ఏలతోపాటు, 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని, ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. కేంద్రం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2021-22 జాతీయ పంచాయతీ అవార్డులను ప్రకటించిందని, మొత్తం 46 అవార్డుల్లో 13 తెలంగాణకు దక్కాయని అన్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 80కి పైగా అవార్డులు రాష్ట్రం సొంతం అయ్యాయని అన్నారు.

తెలంగాణకు వచ్చిన అవార్డుల్లో స్వచ్ఛ సుందర్ శౌచాలయ్ 2019లో తెలంగాణ – రెండో స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ) పెద్దపల్లి జిల్లా తొలి స్థానం (జిల్లాల క్యాటగిరీ)కి దక్కిందని, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2019 కింద తెలంగాణ – రెండో స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ)లో నిలిచిందని, గందగీ ముక్త్ భారత్ 2020 కింద తెలంగాణ తొలి స్థానం (రాష్ట్రాల క్యాటగిరీ)లో దక్కించుకుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా – మూడో స్థానం (జిల్లాల కేటగిరీ ) సిద్దిపేట జిల్లా – ఉత్తమ ప్రదర్శన జిల్లాగా దక్కించుకుందని, ఈ -పురస్కార్ అవార్డు 2021 తెలంగాణ తొలి స్థానం (క్యాటగిరీ-2) దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ అవార్డు-2021 దక్కిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయని, పొట్ట కూటికోసం వలస వెళ్లిన పల్లె జీవులు సొంతూరుకు వచ్చి సంతోషంగా పని చేసుకుంటున్నారని అన్నారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత గడిచిన తొమ్మిది సంవత్సరాలలో గ్రామాలలో ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుచున్నదని, తెలంగాణ రాకముందు గ్రామాలలో ఎండకాలంలో రెండు ప్రధాన సమస్యలు తాగునీటి సమస్య, కరెంట్ సమస్య ఉండేదని అన్నారు. రాజేందర్ నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితులు ఎట్లా ఉండెనో, ఇపుడు ఎట్లా ఉన్నాయో బేరీజు వేసుకోవాలని అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటు పరిశుభ్రంగా ఉండేట్లు చేసుకున్నామని అన్నారు.

పల్లె ప్రగతి ద్వారా పల్లెలో వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్లు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కలెక్టర్ హరీశ్ లతో కలిసి గ్రామ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించారు. ్రఅనంతరం గామంలో నూతన పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. కవ్వగూడ గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు వచ్చిన సందర్బంగా ఎంపిపి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీఓ, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులను, గ్రామ ప్రజలను ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్, ఆర్డీఓ చంద్రకళ, ఎంపిపి, జయమ్మ శ్రీనివాస్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తన్వి రాజు ఎంపీడీఓ, ప్రతిభ గ్రామ సర్పంచ్, రమేష్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు నీరటి రాజు, విశ్వనాధ్, మంచర్ల శ్రీనివాస్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News