Monday, April 7, 2025

మదపు టేనుగును పెంచుతున్నావని బిజెపి ఎంఎల్‌ఎపై దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏనుగును పెంచుతున్న యజమాని ఐనా బిజెపి ఎంఎల్‌ఎపై గ్రామస్థులు దాడి చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా మూడిగెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుందూరు గ్రామంలో సతీస్ గౌడ, శోభ అనే దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పశువుల మేత కోసం గడ్డి కోయడానికి గ్రామ శివారులోని పొలానికి వెళ్లారు. అదే సమయంలో ఏనుగు దాడి చేయడంతో శోభ ఘటనా స్థలంలోనే చనిపోయింది. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందిని పరిహారం ఇవ్వాలని ధర్నాకు దిగారు. బిజెపి ఎంఎల్‌ఎ ఎంపి కుమారస్వామి మృతుల కుటుంబాను పరామర్శించేందుకు ఆ గ్రామానికి వెళ్లారు. సదరు ఏనుగును బిజెపి ఎంఎల్‌ఎ పెంచుతున్నాడని ఆరోపణలతో అతడిపై గ్రామస్థులు దాడి చేశారు. గ్రామస్థులను ఎంఎల్‌ఎను రక్షించి అక్కడి నుంచి పంపించేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News