Sunday, January 19, 2025

ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై స్థానికుల దాడి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు వెళ్లిన ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వాహనం దెబ్బతింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , తొలుత దాడికి పాల్పడింది ఎన్‌ఐఎ అధికారులేనని పేర్కొన్నారు.

2022 డిసెంబర్ 3న ఓ ఇంట్లో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు. మొదట పోలీస్‌లు ఈ కేసును దర్యాప్తు చేశారు. తరువాత ఎన్‌ఐఎకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని ఎన్‌ఐఎ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేసి తిరిగి కోల్‌కతాకు వెళ్తుండగా స్థానికులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై రాళ్లు రువ్వారని పోలీస్‌లు తెలిపారు. దీనిపై ఎన్‌ఐఎ అధికారులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల రేషన్ స్కామ్ సంఘటనలో సందేశ్ కాళీకి వెళ్లిని ఈడీ అధికారులపై కూడా ఇలానే దాడి జరిగింది. భూపతి నగర్‌లో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తొలుత దాడి చేసింది మహిళలు కాదని, ఎన్‌ఐఎ అధికారులేనని ఆమె ఓ ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. అందుకే చేసేది లేక తిరిగి దాడికి పాల్పడ్డారన్నారు. ఎన్‌ఐఎ, సీబీఐ బీజేపీకి సోదరులైతే, ఈడీ, ఐటీ ఆ పార్టీకి ఫండింగ్ బాక్సులంటూ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News