Wednesday, January 22, 2025

షాకింగ్.. వికారాబాద్ కలెక్టర్పై దాడి.. రాళ్లు, కర్రలతో తరిమికొట్టిన ప్రజలు

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్పై దాడి జరిగింది. కలెక్టర్ తోపాటు పలువురు అధికారులను రాళ్లతో తరిమికొట్టారు. ఈ ఘటన దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీపై అభిప్రాయ సేకరణకు కలెక్టర్ ప్రతిక్ జైన్,కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లారు.

ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వాలంటూ రైతులను, గ్రామస్తులను కలెక్టర్, అధికారులు కోరారు. తాము భూములు ఇవ్వమంటూ ఒక్కసారిగా కలెక్టర్, అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోతున్న కలెక్టర్, అధికారుల వాహనాలను వెంబడించి రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ దాడిలో అధికారుల పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News