Thursday, December 26, 2024

కుమార్తెను నరికి చంపిన తండ్రి.. పోలీసు వాహనంపై గ్రామస్థుల దాడి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: క్షణికావేశంలో ఓ తండ్రి తన కన్న కూమారైను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథిని మండలం భట్టుపల్లిలో చోటుచేసుకుంది. మృతురాలిని రజితగా గుర్తించాడు. 6 నెలల క్రితం నిందితుడు సదానందం తన భార్యను చంపాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

స్థానికుల సమాచారంతో ఘటానాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి వాహనంలో తీసుకెళ్తుండగా సదానందంను తమకు అప్పగించాలని పోలీసు వాహనంపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో పోలీసులు గ్రామస్థులకు నచ్చచెబుతున్నారు. కుటుంబకలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News