Thursday, January 23, 2025

గ్రామ దేవతలకు మొక్కులు సమర్పించిన గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : మండల కేంద్రమైన లోకేశ్వరంతో పాటు మండలంలోని పంచగుడి, ధర్మోరా, వట్టోలి, అబ్దుల్లాపూర్, తదితర గ్రామాలలో ఆదివారం ఆయా గ్రామాల ప్రజలు గ్రామ దేవతలకు నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా భాజా భజంత్రీలతో గోదావరి నది నుండి జలాలను తీసుకవచ్చి గ్రామ దేవతలకు అభిషేకించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మృగశిర కార్తే ప్రారంభమవ్వగానే ఆషాడమాసంలో పంటలు వేసి ముందు గ్రామ దేవతలకు నది జలాలతో అభిషేకించి విత్తనాలు వేయడం అనాదిగా వస్తున్న ఆచారమని తద్వారా పాడి పంటలు సమృద్ధ్దిగా పండుతాయని తమ గ్రామాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్థ్దిల్లుతాయని ప్రగాఢ విశ్వాసమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News