- Advertisement -
శివ్వంపేట: మండల పరిధిలోనిబిక్యా తాండ గ్రామపంచాయతీ లోని సీత్యాతాండాలో చిరుత సంచరించినట్లు శనివారం రాత్రి చోటు చేసుకుంది. రైతులు పొలంలో పంట కాపల కోసం వెళ్లిన రైతులు చిరుత పులి సంచరించినట్లు దాని యొక్క గాండ్రిపులను సెల్ ఫోన్లో రికార్డు చేసినట్లు తండావాసులు తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం ఇదే పంచాయతీలోని గేమ్స్ సింగ్ తండాలో కనిపించిన చిరుత సీత్యా తాండలో సంచరించినట్లు రైతులు తండావాసులు భయాందోళన చెందుతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
- Advertisement -