Thursday, January 23, 2025

అర్వింద్.. మేమిప్పుడు గుర్తొచ్చామా?

- Advertisement -
- Advertisement -

హామీలు మరిచారని
విరుచుకుపడిన గ్రామస్థులు

వాహనాల అద్దాలు ధ్వంసం గో బ్యాక్ అంటూ నినాదాలు

మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ని జామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌కు నిరసన సెగ తగిలింది. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు వె ళ్తున్న అరవింద్‌పై కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో గ్రామస్థులు అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలు ధ్వంసమయ్యా యి. పదుల సంఖ్యలో గ్రామస్థులు అక్కడకు చేరుకుని ఎంపి అరవింద్‌ను రానీయకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో గెలిపిస్తే బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ గ్రామంలో ఉన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానని అబద్దపు హామీ ఏమైందని ఎంపిని గ్రామస్థులు నిలదీశారు. ఎన్నికలు జరిగి మూడేళ్లు అయ్యాకా.. ఇప్పడు గుర్తుచ్చామా అంటూ నిలదీశారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపి అరవింద్ కాన్వాయ్‌పై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. కాన్వాయ్‌తోపాటు మరో రెండు కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈక్రమంలో కారులో ఉన్న అరవింద్‌కు చెప్పులదండ వేసేందుకు గ్రామస్థులు యత్నించారు.

ఈ పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వెంటనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ భద్రత నడుమ ఎంపి కాన్వాయ్ అక్కడి నుంచి కోరుట్ల పంపించివేశారు. కాగా, దాడికి పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నించిన ఎంపి అరవింద్‌కు సమీపంలోని కెసిఆర్ కాలనీలోని మహిళలు గ్యాస్ బండలతో స్వాగతం పలికారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించకుండా ఏ ముఖం పెట్టుకుని మా దగ్గరకు వస్తున్నావంటూ నిలదీశారు. రూ.400 ఉండే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.11.50కు పెంచేశారని తాము ఇక ఏలా జీవనం సాగించాలని పలువురు మహిళలు నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News