Monday, January 20, 2025

బిజెపి ఎమ్‌ఎల్‌ఎను తరిమి కొట్టిన గ్రామస్థులు.. (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

లక్నో: ఓట్లు అడిగేందుకు వచ్చిన బీజేపి ఎమ్‌ఎల్‌ఎను గ్రామస్థులు తరిమికొట్టిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ అసెంబ్లీ నియోజక వర్గం లోని ఓ గ్రామంలో వెలుగు చూసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి ఎమ్‌ఎల్‌ఎ విక్రమ్‌సింగ్ సైనీ ముజఫర్‌నగర్ లోని ఓ గ్రామానికి వచ్చారు. అప్పటికే ఎమ్‌ఎల్‌ఎ విక్రమ్ సింగ్ సైనీపై ఆగ్రహంతో ఉన్న అతని సొంత నియోజక వర్గం పరిధి లోని గ్రామస్థులు అతన్ని తరిమికొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అయింది. ఖతౌలీ నియోజక వర్గానికి చెందిన ఎమ్‌ఎల్‌ఎ సైనీ బుధవారం ఒక గ్రామంలో సమావేశానికి రాగా, కోపంగా ఉన్న గ్రామస్థులు అతని కారును వెంటాడి గ్రామం నుంచి తరిమారు. ఎమ్‌ఎల్‌ఎ గ్రామంలోకి రాగానే అతని వెనుక అరుస్తూ వెంటాడారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది జరిగిన రైతుల నిరసన తరువాత ప్రస్తుతం రద్దు చేసిన చట్టాలపై పలువురు ఆగ్రహంతో ఉంటున్నారు. దీంతో ఎమ్‌ఎల్‌ఎ సైనీ తన నియోజక వర్గాన్ని విడిచి వెళ్లవలసి వచ్చింది. గతంలో సైనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో అసురక్షితంగా భావించే వారిపై బాంబు వేస్తానని బెదిరించారు. దానికి ఒక సంవత్సరం ముందు సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Villagers protest against BJP MLA in UP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News