Monday, December 23, 2024

ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను బంధించిన గ్రామస్థులు

- Advertisement -
- Advertisement -

Villagers who captured two Lashkar terrorists

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ రెయిసీ జిల్లా లోని టక్సన్ గ్రామంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులను గ్రామస్థులు ఆదివారం బంధించి పోలీసులకు అప్పగించారు. వీరిలో లష్కరే కమాండర్ తాలిబ్ హుస్సేన్ కూడా ఉన్నాడు. ఇతను రాజౌరీ జిల్లాకు చెందిన వాడు. ఇటీవల ఆ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుళ్ల వెనుక ఇతడి హస్తం ఉంది. మరో ఉగ్రవాది ఫైజల్ అహ్మద్ దార్ దక్షిణ కశ్మీర్ లోని పుల్వామా జిల్లాకు చెందిన వాడు. ఇతడు మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రెండు ఏకే రైఫిల్స్, ఏడు గ్రెనేడ్‌లు, పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ధైర్యసాహసాలకు గుర్తింపుగా అడిషనల్ డీజీపీ రూ. 2 లక్షల బహుమానాన్ని ప్రకటించారు. దీనికి అదనంగా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా , మరో రూ. 5 లక్షలను గ్రామస్థులకు బహుమానంగా ప్రకటించినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని ఏడీజీపీ జమ్ము ట్విటర్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. టక్సన్ గ్రామస్థులకు పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News