Monday, December 23, 2024

ప్రభుత్వ పథకాల వల్లే గ్రామాలు సస్యశ్యామలం

- Advertisement -
- Advertisement -
  • ప్రజా సమస్యల పరిష్కారానికి పాదయాత్ర
  • ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి

తెల్కపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అభివృద్ది పథకాల వల్లే నేడుగ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయని అందుకు కారణం ముఖ్యమంత్రి కేసిఆర్ అని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అన్నారు.

ఆదివారం మండల పరిధిలోని లక్నారం, గోలగుండం, జమిస్తాపూర్, బొప్పల్లి ఆలేరు గ్రామాల్లో రెండో రోజు పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను గ్రామాలకి వెళ్లి తెలుసుకొని ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను సాధ్యమైనంత త్వరగా ప్రజలకు అందించడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ గ్రామాలకు పాదయాత్రగా రావడంపై ప్రజలు, మహిళలు హరతులిచ్చి బోనాలతో స్వాగతం పలికి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు.

గతంలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదని తమకున్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చి అడిగి తెలుసుకొని పరిష్కారం చేస్తుండటం ఎంతో ఆనందించదగిన విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను అందించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ది పథకాల వల్లే గ్రామాలు నేడు గ్రామాలలో మౌలిక వసతులు కల్పన జరిగి అభివృద్ది చెందుతున్నాయని అన్నారు.

ప్రజా సమస్యలన్నింటిని తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాధవరం హన్మంతురావు, ఎంపీపీ కొమ్ము మధు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఈదుల నరేందర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు జి. మాధవరెడ్డి, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News