Wednesday, January 22, 2025

పరిశుభ్రతకు నిలయాలు గ్రామాలు

- Advertisement -
- Advertisement -

హాజీపూర్ : మండలంలోని టీకనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 20 లక్షల ఎన్‌ఆర్ ఈజీఎస్ నిధులతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు.పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతకు నిలయాలుగా మారాయన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ భవన నిర్మాణ స్థలానికి విరాళాలు అందజేసిన పలువురుని ఎమ్మెల్యే అభినందించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామటెంకి మల్లేశ్వరి దుర్గయ్య, పంచాయతీ కార్యదర్శి హారిక, ఎంపీటీసీ సోగాల సుజాత కిష్టయ్య, ఉప సర్పంచ్ జితేందర్రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పుస్కూరి శ్రీనివాసరావు, సర్పంచుల ఫోరం మండల అద్యక్షుడు గొల్ల శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాదవరపు జీవన్‌రావు, యూత్ అద్యక్షుడు బాపు, సోనమ్, జయరాజు, కనకమ్మ, పెద్దసత్యగౌడ్, సర్పంచులు మధుసూదన్‌రెడ్డి, కొట్టె మహేందర్, నాయకులు మొగిలి ప్రశాంత్, రాజయ్య, ప్రభాకర్, భూమయ్య, రామయ్య, పోచయ్య, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News