Monday, December 23, 2024

కాళేశ్వరం నీళ్లను చూడటానికి తరలివచ్చిన గ్రామాలు

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : ఎస్‌ఆర్‌ఎస్పీ పునర్జీవన పథకం ద్వారా కాళేశ్వరం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు విడుదల చేయడంతో జీరో పాయింట్ దగ్గరికు ప్రజల తండోపదండలుగా కుటుంబసమేతంగా వచ్చి నీటిని ఎత్తిపోస్తున్న తీరును చూస్తున్నారు. అదేవిధంగా రివర్స్ పంపింగ్ ద్వారా నీళ్లు ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు ప్రాజెక్టును సందర్శించి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో 300 కిలోమీటర్ల నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువలోకి ఎలా ప్రవహిస్తుందో రైతులు తెలుసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైతుల సందర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ప్రతి రోజు నియోజకవర్గంలోని రైతు వేదిక క్లసర్లవారీగా రైతులు ముప్కాల్ పునరుజ్జీ వనం మూడో పంపు హౌజ్ వద్దకు దశల వారీగా తరలి వస్తున్నారు.

పంపు హోజ్‌ను సందర్శించడానికి వచ్చిన రైతులకు ఒక పూట భోజనానికి కూడా మంత్రి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టు విశేషాలు రైతులకు వివరించడానికి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ఉన్న ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోకి రైతులు లోపలికి వెళ్లకుండా వీఆర్‌ఏలు కాపలాగా బాధ్యత తీసుకొని రక్షణగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. పంపు హౌజ్‌లో నీరు ఎలా వస్తుందో తెలుసుకోవడానికి రైతులను బస్సుల్లో తీసుకువస్తురన్నారు. పంపు హౌజ్‌లతోపాటు ప్రాజెక్టును కూడా తిలకించి రైతుల సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంపుహౌజ్‌లతోపాటు ప్రాజెక్టులో రైతులకు సందడిగా మారింది. సుమారు నెలరోజుల పాటు రైతుల సందర్శన ఉంటుందని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ తెలిపారు. రోజుకో రెండు గ్రామాల ద్వారా దాదాపు 500 మందిని ఐదు బస్సుల ద్వారా తరలిస్తున్నారు.

ఎస్సారెస్పీ జీరో పాయింట్ వద్ద కాలేశ్వరం నుంచి 2188 క్యూసెక్కుల నీటిని నాలుగు మోటార్ల ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1065 అడుగులకు చేరి 27.743 టీంసిలుగా ఉంది ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2977 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.
భద్రత పెంచిన అధికారులు
ముప్కాల్ కాలేశ్వరం పంప్‌హౌస్ వద్ద నిత్యం సందర్శకులు తాకిడి పెరగడంతో భద్రత ఏర్పాట్లు చేయడంలో అధికారులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. నీరు వెళ్తున్న కాల్వ పక్కన చిన్నకర్రలతో చిన్న కంచె ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు చూటానికి వచ్చి వచ్చి అదుపుతప్పే అవకాశం ఉందని భద్రత చర్యలు చేపట్టాలని స్థానికులు కోరడంతో అధికారులు భద్రత పెంచారు.

గోదావరి నీళ్లలో కాలేశ్వరం నీళ్లు కలిసే ప్రదేశంలో పర్యాటకులు సెల్ఫీలు తీయడం, స్నానాలు చేయడం వంటివి ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్ట్ అధికారులు పోలీసులు బాధ్యత చర్యలను గురించి ఆలోచించి వీఆర్‌ఐలను పర్యాటలకు రక్షణగా కట్టుదిట్టగా ఉంచారు. పోలీసులు భద్రతాపరమైన ఫ్లెక్సీలను ప్రమాదకరమైన ప్రదేశాలలో అతికించారు.
రైతన్న కళ్ల ల్లో ఆనందం
ఎస్సార్‌ఎస్పీ పునర్జీవం ముప్కాల్ పంప్‌హౌస్ వద్దకు కాలేశ్వరం నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా తరలిస్తుండడం రైతులు రోజుకు 500 మందికి పైగా వస్తున్నారు. ఆరుబయట మోకాన్ని మొగులికి చూసి వర్షం ఎప్పుడు పడుతుందో అని ఆశతో ఎదురు చూసే రైతన్న రివర్స్ పంపింగ్ ద్వారా కొన్ని వందల కిలోమీటర్లు నీరు వెనక్కి రప్పించే మహత్ కార్యక్రమం కళ్ళముందు తాండవిస్తుంటే ఒక్కసారి రైతన్న కళ్లలో ఆనంద భాష్పాలతో గోదారి నీటిని చేతులతో తాకి నుదుటి మీద చల్లుకుంటున్నారు.

ఆడపడుచులు సెల్ఫీలు దిగుతూ జై ప్రశాంత్ రెడ్డి, జై కెసిఆర్ అని నినాదాలు చేస్తున్నారు. ఆడపడుచులు, రైతన్నలు ఒక్కసారిగా నాలుగు పంప్‌హౌస్‌లో పనితీరును చూసి ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఇకతమకు వర్షాలు పడినా పడకన్నా పెద్ద సమస్య ఉండదని కెసిఆర్ ప్రభుత్వం తమకు కావాల్సిన నీళ్లు సమకూరుస్తుందని రైతనలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ఇంత కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ని నిండు నూరేళ్లు చల్లగా బతకాలని తప్పక వచ్చేది కెసిఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News