Saturday, November 2, 2024

రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

జుక్కల్: రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే అన్నారు. గురువారం మండలంలోని లొంగన్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 9 ఏండ్ల పాలనలో ఎంతో అభివృద్ధ్ది జరిగిందన్నారు. గ్రామ గ్రామాన మౌళిక సదుపాయాల కల్పనకు సిఎం కెసిఆర్ అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నారని, ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరపున సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక ధన్యవాదలు, కృతజ్ఞతలన్నారు.

దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణలో జరిగిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడప గడపకు వివరించాలన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్లు, ఆసరా పెన్షన్లు, ఇలా అనేక రకాలుగా యావత్ దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ సహకారంలో జుక్కల్ నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు కల్పిస్తున్నామన్నారు.

అర్హులైన వారికి తెలంగాణ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎంపీపీ యశోద నీలు పటేల్, లొంగన్ సర్పంచ్ ఉషారాణి, సొసైటీ చైర్మన్ శివానంద్, నాయకులు సాయాగౌడ్, మాధవ్ రావు దేశాయి, గంగు నాయక్, గ్రామాల పెద్దలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News