సంగారెడ్డి: తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండేవని, ఇప్పుడు ఎలా మారి పోయాయని, అభివృద్ధి కళ్ళ ముందే కనిపిస్తుందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కంగ్టి మండలంలో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యవతి మీడియాతో మాట్లాడారు. ఎస్టి ప్రజల చిరకాల ఆకాంక్షను సిఎం కెసిఆర్ నెరవేర్చారని కొనియాడారు. తెలంగాణలోని అన్నిగూడెంలు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చింది మన సిఎం అని కొనియాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3146 మంది ఎస్టిలు కొత్తగా సర్పంచులు అయ్యారన్నారు. ఎస్టి సంక్షేమం కోసం బడ్జెట్ లో రూ. 600 కోట్లు పెట్టుకున్నామని, అన్ని తండాలలో బిటి రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. సిఎం కెసిఆర్ కు గిరిజనులు అంటే ఎంతో ప్రేమ ఉందని, ఎస్టి సంక్షేమం కోసం ఎంతో చేస్తున్నారని సత్యవతి మెచ్చుకున్నారు. గురుకులాలు, కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్లు మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.
3146 మంది ఎస్టిలు కొత్తగా సర్పంచులు అయ్యారు: సత్యవతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -