Monday, December 23, 2024

స్వచ్ఛ సర్వేషణ్ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలి

- Advertisement -
- Advertisement -

మరిపెడ : స్వచ్ఛ సర్వేక్షణ్ లలక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలని స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ట్ర పరిశీలకుడు నాగభూషణం అన్నారు. జాతీయ స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2023 అవార్డు ఎంపిక కోసం నిర్వహించే సర్వేలో భాగంగా మంగళవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామంలో పర్యటించి ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్‌తో కలిసి గ్రామ పంచాయితీ కార్యాలయం, అంగన్‌వాడీ కేంద్రం, డ్రైనేజీలు, సిసి రోడ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 అవార్డుల ఎంపికలో భాగంగా ఈ నెల 15 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిపారు. అభివృద్ధికి దోహదపడే పలు అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను అందిచనున్న నేపథ్యంలో అన్ని విధాలుగా సంసిద్దంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలాన్ని దేశ వ్యాప్తంగా ఆదర్శంగా ఉండే విధంగా చూడాలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు ఆదర్శ గ్రామాలను పరిశీలించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు లక్ష్మిలక్‌పతి, ఇన్‌చార్జ్ ఎంపిఓ నూతక్కి శ్రీరామకృష్ణ, కార్యదర్శులు దొంతు లెనిన్, రమేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News