అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ వారి హెచ్చరిక’ చిత్రం నుంచి ఒక వినూత్నమైన ప్రేమగీతం ఆవిష్కరణ జరిగింది. ఈ సినిమాలో విలన్లు ప్రేమగీతాలు పాడుకునే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ పాటను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “సాధారణంగా సినిమాల్లో హీరో-హీరోయిన్లు ప్రేమగీతాలు పాడుకుంటారు. కానీ ఈ సినిమాలో విలన్లు డ్యూయెట్‌లు పాడుకోవడం ఒక వెరైటీ కాన్సెప్ట్”అని అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ త్వరలో సెన్సార్ పనులు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాత బెల్లి జనార్థన్ మాట్లాడుతూ “ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం”అని పేర్కొన్నారు.