Monday, January 20, 2025

మంచి సినిమాను ప్రేక్షకులే భుజాలపై మోసి ఆదరిస్తారు

- Advertisement -
- Advertisement -

సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘విమానం’. తాజాగా తెలుగు, తమిళం భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్) కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. శనివారం ఈ మూవీ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్ర ఖని మాట్లాడుతూ “ఓ మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్లే ఆ సినిమాను భుజాలపై మోస్తారని చెప్పడానికి ‘విమానం’ సినిమా మంచి ఉదాహరణ. విమానం సినిమా విడుదల తర్వాత థియేటర్స్‌సంఖ్య పెరిగాయని జీ స్టూడియోస్ నిమ్మకాయల ప్రసాద్ ఫోన్ చేయడంతో చాలా హ్యాపీగా అనిపించింది”అని అన్నారు.

నిర్మాత కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ “కాన్సెప్ట్, కథలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మౌత్ టాక్ కారణంగా మ్యాట్నీ నుంచి సినిమాకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు థియేటర్స్‌సంఖ్య పెరిగింది”అని తెలిపారు. డైరెక్టర్ శివప్రసాద్ యానాల మాట్లాడుతూ “విమానం సినిమాను చూసిన వారందరూ గొప్పగా ఉందని చెబుతున్నారు. నేను రాసుకున్న వీరయ్య పాత్రకు సముద్ర ఖని, కొడుకు పాత్రకు ధ్రువన్, సుమతి పాత్రకు అనసూయ, కోటి పాత్రకు రాహుల్ రామకృష్ణ, డేనియల్ పాత్రకు ధన్‌రాజ్… ఇలా అందరూ ప్రాణం పోశారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనసూయ భరద్వాజ్, ధనరాజ్, మాస్టర్ ధ్రువన్, హను. వివేక్, చరణ్ అర్జున్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News