Wednesday, January 22, 2025

‘వినరో భాగ్యము విష్ణు కథ’ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా : నిర్మాత బన్నీ వాస్

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.

యువ కథానాయకుడు కిరణ్ అన్నవరం హీరోగా నటించిన ఈ చిత్రంలో కశ్మీర హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం నుండి రిలీజైన సాంగ్స్, టీజర్ అన్ని మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అలానే రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. నెంబర్ నైబరింగ్ కాన్సప్ట్ తో వస్తున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఇక ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఇందులో భాగంగా సినిమా చాలా బాగా వచ్చిందని… ఈ సినిమాలో ప్రేమ, కామెడీ , థ్రిల్లింగ్ .. ఇలా అన్ని అంశాలు మిళితమై ఉన్నాయని . కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ మూవీ ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 16న నిర్వహించబోతున్నామని.. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అక్కినేని అఖిల్ హాజరు కాబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News