Sunday, December 22, 2024

“వినరో భాగ్యము విష్ణు కథ” చిత్రం నుంచి “వాసవ సుహాస” ఫస్ట్ సింగిల్

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”.

ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన క‌శ్మీర ప‌ర్ధేశీ నటిస్తోంది. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇదివరకే ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా నుండి మొదటి సింగిల్ సాంగ్ ను కళా తపస్వి కే విశ్వనాథ్ చేత రిలీజ్ చేయించింది చిత్రబృందం. “వాసవసుహాస” అనే పాటను పాటను రిలీజ్ చేస్తూ “నాకు నా పాత రోజులు గుర్తొస్తున్నాయి, ఎలా ఒప్పుకున్నారా ప్రొడ్యూసర్స్ అనిపిస్తుంది అంటూ ఇటవంటి పాటను ఆ చిత్రబృందం చేయడం సంతోషం అంటూ కితాబిచ్చారు.
ఈ పాటను కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రచించారు,
యుగ యుగాలుగా ప్రభోదమై
పది విధాలుగా పదే పదే.
పలికేటి సాయ
జాడలే కదా నువ్వెదికినదిదైనా
చిరునికి జరిగినా చిరునవ్వుల ప్రాసనా
చిగురేయక అగురా
నిన్ను మార్చినా నిన్నటి అంచునా అని రాసిన క్లిష్టమైన పాదాలకు
వాడికి సాయం చెయ్యమని చెప్పటానికి ఎత్తిన పది అవతారాలు ఆదర్శమే కదా నీది, అదే కదా నువ్వెళ్ళే దారి అలాంటి నీ దారిలో నవ్వులు పూయకుండా ఎలా ఉంటాయి. ఇప్పటి ఆలోచన నిన్నటి నీ అనుభవం నుండి వచ్చిందే కదా. అంటూ సారాంశాన్ని కూడా ఈ పాటలో జోడించడం విశేషం. ఈ పాటను కారుణ్య ఆలపించారు. ఈ సినిమాకి చైత‌న్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌త్య‌గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లు ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News