Monday, December 23, 2024

‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్‌ విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాతగా కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశీ జంటగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు సందర్భంగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే గుడి ముందు డు డు బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ ఉన్న పోస్టర్ అందరినీ అలరించింది. తాజాగా వచ్చిన టీజర్ మరింత ఆసక్తికరంగా ఉంది. “నా పేరు విష్ణు.. మా ఊరు తిరుపతి.. మరికొన్ని రోజుల్లో మీరు చూడబోయేదే నా కథ.. ఇప్పుడు నా కథ ఎందుకు చెబుతున్నానో మీకు తెలుసా.. అని కిరణ్ చెబుతుండగానే.. హ్యాపీ బర్త్ డే విష్ణు అంటూ టీజర్ ముగుస్తుంది. దీనికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న విడుదల కానుంది.

Vinaro Bhagyamu Vishnu Katha Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News