Tuesday, November 5, 2024

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా వినయ్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా(ఇంటర్నేషనల్ కో ఆపరేషన్) తెలంగాణ క్యాడర్ కు చెందిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి డాక్టర్ వినయ్‌ కుమార్ నియమితులయ్యారు. రాష్ట్ర అటవీ శాఖలో సీనియర్ అధికారిగా ఉన్న వినయ్‌కుమార్‌కు ఉన్నత పదవిలో నియామకం అయ్యారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రూడూన్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర అటవీ శాఖలో అదనపు పిసిసిఎఫ్ హోదాలో ఐటి, వర్కింగ్ ప్లాన్ బాధ్యతల్లో ఆయన ఉన్నారు. కొత్త పోస్టులో ఫారెస్ట్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ పై అంతర్జాతీయ సంబంధాలను సమన్వయం చేయనున్నారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వివిధ దేశాలకు చెందిన సంస్థల అటవీ అధ్యయనం, పరిశోధనలు, పర్యావరణ మార్పులపై జరిగే సదస్సులను వినయ్‌కుమార్ పర్యవేక్షిస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News