Friday, December 20, 2024

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

Vinay Kumar Saxena sworn in as Delhi Lieutenant Governor

న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా గురువారం ప్రమాణం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, ఢిల్లీకి చెందిన ఎంపిలు, ఎంఎల్ఏలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ పదవికి అనిల్ బైజాల్ రాజీనామా చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వినయ్ కుమార్ సక్సేనా నియమించింది. సక్సేనా ఇంతకు ముందు ఖాధీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ చైర్ పర్సన్ గా పద్మ పురస్కారాల ఎంపిక ప్యానల్ సభ్యుడిగా పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News