- Advertisement -
న్యూఢిల్లీ : భారతదేశ తదుపరి విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రాను కేంద్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. వినయ్ మోహన్ ఇప్పుడు నేపాల్‌లో భారత రాయబారిగా ఉన్నారు. ఇప్పటివరకూ విదేశాంగ కార్యదర్శిగా ఉన్న హర్ష వర్థన్ శృంగాలా ఈ నెల 30వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానాన్ని క్వాత్రా భర్తీ చేస్తారు. ఆయన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) సభ్యులుగా ఉన్నారు. దౌత్య వ్యవహారాలలో పలు కీలక పదవులలో ఆయన దాదాపుగా 32 ఏండ్లుగా అనుభవం గడించారు. ఇంతకు ముందు ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. దీనికి ముందు ప్రధాన మంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
- Advertisement -