Wednesday, November 6, 2024

రక్షణ పరిశ్రమలే కీలకం: క్వాత్రా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా అధికారిక పర్యటన క్రమంలో ఇరు దేశాల మధ్య మరింత రక్షణ సంబంధాలపై దృష్టి సారిస్తారు. ఇదే ఈ పర్యటన ప్రధాన అజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం విలేకరుల గోష్టిలో తెలిపారు. ప్రధానంగా రక్షణ భద్రత విషయాలపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్‌తో చర్చలు ఉంటాయి. పరిశ్రమల స్థాపనల దిశలో రోడ్‌మ్యాప్ ఖరారు కీలక విషయం కానుంది. వివిధ రంగాల్లో సహ ఉత్పత్తి, కలిసికట్టు అభివృద్ధి, సరఫరాల నిర్వహణ వంటివాటిపై విధివిధానాల రూపకల్పన ఉంటుందని క్వాత్రా తెలిపారు. వాణిజ్యం పెట్టుబడుల సత్సంబంధాలపై బైడెన్‌తో విశ్లేషణాత్మక చర్చలు ఉంటాయి. ఇప్పటికే అమెరికాలో ఐటి , సాంకేతిక రంగంలో భారతీయత విస్తరించుకుని ఉన్న దశలో టెక్నాలజీ పరిధిలోకి వచ్చే టెలికం, అంతరిక్షం, ఉత్పత్తి రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు.

Also Read: అమెరికాలో మోడీ జోష్…హోష్

రక్షణ సంబంధిత పారిశ్రామిక రంగంలో ఇప్పుడు పలు అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో అమెరికా , భారత్ పరస్పర సహకారం దిశలో ప్రధాని చర్చలు ఉంటాయని కార్యదర్శి తెలిపారు. భారత్, అమెరికా రక్షణ భాగస్వామ్యం అత్యంత కీలక విషయం అని, ఈ పరిధిని మరింత విస్తృతపర్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ దిశలోనే విస్తృతస్థాయిలో ఇండియా యుఎస్ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు అనేకం జరిగాయని , ఇవన్నీ కూడా ద్వైపాక్షికమే కాకుండా ప్రాంతీయ స్థాయిలో కూడా ప్రయోజనకరమైనవని తెలిపారు. అమెరికాలో పర్యటన తరువాత ప్రధాని మోడీ ఈ నెల 24 , 25 తేదీలలో ఈజిప్టులో ఆ దేశ అధ్యక్షులు అబ్దెల్ ఫతా ఎల్ సిసి ఆహ్వానం మేరకు పర్యటిస్తున్నారని వినయ్ వివరించారు. బోహ్రా మతస్తులు ఇటీవలే పునరుద్ధరించిన ప్రఖ్యాతమైన 11వ శతాబ్ధపు అల్ హకీం మసీదును ప్రధాని ఈ సందర్భంగా సందర్శిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News